శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవా నమో దేవా

దేవా నమో దేవా పావన గుణగణభావా

జగదాధారా చతుర్భుజ గగననీల మేఘశ్యామ
నిగమపాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా

ఘనవేదాంతై ర్గణన వుదార కనకశంఖ చక్ర కరాంకా
దినమణి శశాంక దివ్యవిలోచన అనుపమ రవిబింబాధరా

భావజకంజ భవజనక శ్రీవనితా హృదయేశ
శ్రీవేంకటగిరి శిఖరవిహార పావన గుణగణభావా

No comments:

Post a Comment