శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవ నీదయ

దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో కావించి అంటగటుక కాచుకుండె విదివో

వెదక నావసమా వేగుదాకా నిన్ను నేను కదిసి నీమూరితి కానవసమా
యెదుట శంఖుచక్రాల యెట్టిదైవమ నేనని పొదుగుచు నీకునీవే పొడచూపేవుగాక

పొగడ నావసమా పురుణించి నీగుణాలు తగుల నావసమా నీతలపెఱిగి
విగిడి వేదశాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని పగటుమాయజ్ఞానము పాపే వింతేకాక

కొలువ నావసమా గుఱుతెఱిగి నీవెంట చెలగి నాచేతుల బూజించవసమా
నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి మలసి పెరరేపుచు మన్నించేవుగాక

No comments:

Post a Comment