దేవ నీమాయతిమిర మెట్టిదో నా భావము చూచి గొబ్బన గావవే
వెడదుఃఖమపుడెల్ల వేసరుచుండుదుగాని తడవి విరతిబొంది తలగలేను
అడియాసల దిరిగి అలయుచుండుదుగాని మడి దొసగుల నివి మానలేను
హేయము స్త్రీసుఖమని యెరుగుచుండుదుగాని పాయపుమదముచేత బాయలేను
పాయనిపాపాలు చూచి భయమందుచుందుగాని వోయమ్మ యివి సేయకుండలేను
కలకాల మిన్నియును గందువిందు గానిమరి యెలమి నొక్కటనైన యెచ్చరలేను
బలిమి శ్రీవేంకటేశ బంధముక్తుని జేసి తలపులో నెలకొని దయజూడవయ్యా
No comments:
Post a Comment