శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవ నీవిచ్చేయందుకు

దేవ నీవిచ్చేయందుకు దీనికిగా నింతయేల యేవేళ మాయెరుకలు యెందుకు గొలుపును

యెవ్వరివసములు బుద్దెరిగినడచేమన యివ్వల నారాయణ నీవియ్యక లేదు
దవ్వుచేరువ మనసుతనయిచ్చయితే గనక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా

సారెకు నిన్నుదలపించ జంతువులవసమా కేరి నీవు జిహ్వ బరికించగాగాక
యీరీతి లోకమెల్లా దమయిచ్చకొలదులనయితే దూరాన గొక్కెరలు చదవవా వేదాలు

యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేతలే కందువ స్వతంత్రులు గారు గాన
చందపుశ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు చెంది నీవే కాతువుగా చేతలూను వలెనా 

No comments:

Post a Comment