శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవ యీ తగవు

దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా

తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా

పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా

లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నాయాత్మను గలిగితి వెక్కడి కలుషములయ్యా

No comments:

Post a Comment