దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో భావించ నింతలో భూభారమెల్ల నణగె
నేడు కృష్ణుడు జనించె నేడే శ్రీజయంతి నేడే రేపల్లెలోన నెలవైనాడు
వేడుక యశొదకు బిడ్డడైనాడిదె నేడే పోడిమి జాతకర్మ మొప్పుగనాయ నేడు
ఇప్పుడిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము ఇప్పుడు తొట్టెలనిడి రింతు లెల్లాను
చెప్పరాని బాలలీల సేయగల దెల్లా జేసి కప్పెను విష్ణుమాయలు గక్కన నేడిపుడు
ఇదివో వసుదేవుని ఇంటిచెరలెల్లబాసె ఇదివో దేవకి తప మిట్టెఫలించె
చెదరక తా నిలిచె శ్రీవెంకటాద్రిపై నిదె యెద నలమేలుమంగ యెక్కివున్న దిదివో
No comments:
Post a Comment