శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవదేవు డెక్కెనదె

దేవదేవు డెక్కెనదె దివ్యరథము మావంటివారికెల్ల మనోరథము

జగతి బాలులకై జలధులు వేరజేసి పగటున దోలెనదె పైడిరథము
మిగులగ గోపగించి మెరయురావణమీద తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము

దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు బక్కన మరలిచె బుష్పరథము
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణురథము

బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె అలయేగుబెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి కలకాలమును వేగె ఘనమైనరథము

No comments:

Post a Comment