దేవదేవోత్తముని తిరుతేరు దేవతలు గొలువగా తిరుతేరు
తిరువీధి లేగీని తిరుతేరు తిరుపు గొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజుల దిరుతేరు తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు
ధిక్కరించీ మోతల దిరుతేరు దిక్కరి కుంభాలదర దిరుతేరు
తిక్కు ముత్తేల కుచ్చుల తిరుతేరు తెక్కుల బ్రతాపించీ తిరుతేరు
తీరిదె గలకలెల్ల దిరుతేరు ధీర గరుడవాహపు దిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీ వేంకటేశ్వరుని తీరున నెలకొన్నట్టి తీరుతేరు
No comments:
Post a Comment