శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చెక్కిటి చే యిక

చెక్కిటి చే యిక నేల చింతలేల అక్కరతో నాపె నీ యలపారిచీ గాక

జవ్వనపు సతి తోడి సరసము చివ్వన నీ మేనెల్లా జెమరింపించె
పువ్వుల వసంతాలు పొలయాటలూ నవ్వి నవ్వి నీ మనసు నాము లెక్కింపించె

చక్కెర బొమ్మవంటి యీ సతి పొందులు చిక్కించి నీకు వలపు చిమ్మిరేగించె
నిక్కి నిక్కి యాపె జూచె నీ వేడుకలు చెక్కుల చెనకులయి సిగ్గు విడిపించె

అలమేలు మంగతో నెయ్యపు రతులు నిలువెల్ల సింగారమై నీకు నమరె
నెలవై శ్రీ వేంకటేశ నీ తమకము అలరిన చుట్టరికమై తగిలించె

No comments:

Post a Comment