శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

తందనాన ఆహి

తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే

కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే చండాలు డుండేటి సరిభూమి యొకటే

అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే ఘనకీట పశువులకు కామ సుఖమొకటే
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే వొనర నిరుపేదకును వొక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే
పరగ దుర్గంధములపై వాయువొకటే వరుస బరిమళముపై వాయువొకటే

కడగి యేనుగు మీద గాయు యెండొకటే పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే


Download

No comments:

Post a Comment