శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

తగిలనమును

తగిలనమును లేయాతని గందురంటా మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు

అతుల నిరాహరులాతనికి బ్రియులంటా అతివ నిన్నటినుండి యారగించను
తతినడపుల నుండి తపసు లేయతనికి హితులంటా వనములో నెడయ దీ తరుణి

తలకొన్న యతనిపై తలపే పరమంటా చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు
వలనైన యాతడు దేవతల కొడయడంటా కలికి రేయిబగలు కనుముయ్యదిపుడు

అడరిజలములోన నతడుండునంటా వడియు జెమట దుడువదు మేనను
కడు మంచియతడు వేంకటగిరి విభుడంటా పడతి యాతనినె గుబ్బలనోత్తనిపుడు

No comments:

Post a Comment