తగుతగు నీ దొరతనము లిక వెగటు లన్నియును వేడుకలాయ
విరసపు తిట్లు వేవేలు దిట్టిన సరసపు వేళల చవులాయ
యెరవుల చేత నీ వేమి సేసినా సరినా కౌగుట చందములాయ
బొమ్మ జంకెనలు పొరి నెన్నైనా నమ్మితి చితే చవులాయ
దిమ్మరివై యెందు దిరిగి వచ్చినా నెమ్మి నన్నేలగా నేరుపులాయ
అంగము లలయగ నంటబెనగినా సంగడి రతులను చవులాయ
రంగు శ్రీ వేంకటరమణ నన్నెనసితి వెంగిలి మోవుల కిచ్చకమాయ
No comments:
Post a Comment