శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తగుదువమ్మ నీ

తగుదువమ్మ నీ వందపుమరుతండ్రికి మొగిదచ్చి నమృతము మోవి నుంది గాన

కోమలి నీ జవ్వనము కొలదివెట్టగరాదు ప్రేమమున మీద మీద పెరిగీ గాన
ఆమని నీ సింగార మంతైంత అనరాదు వేమారు నీ చూపు వెల్లివిరిసీ గాన

తొయ్యలి నీ వొరపులు తులదూచి చెప్పరాదు నెయ్యపు నీ తురుమిదె నిక్కీ గాన
చయ్యన నీ సొబగులిచ్చుట నియమించరాదు అయ్యన నీ పిరుదునకలవి లేదు గాన

వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు కొన నీ పాదములు చిగురులు గాన
తనరు నీ భాగ్యము తలచ నలవి కాదు ఘనుడు శ్రీవేంకటేశు కలసితివి గాన

No comments:

Post a Comment