శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తతిగని తతినేల

తతిగని తతినేల తమకించరే మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే

పతిబాసి వున్నదాన బలువిరహపు వేళ యితవంటా విరులు నాకేల యిచ్చేరే
రతిరాజు నమ్ములివి రంట దెప్పరపు వెళ కతుకున నాటుజేసు గవిశన నిడరే

కందువ జవ్వనమున గావరించి వున్నవేళ యిందమంటా గందము నాకేల పూసేరే
మంద మారుతాన కవి మచ్చు చల్లే చొక్కుమందు యిందుకేల పెట్టె గట్టి యింటిలోన నిడరే

శ్రీ వేంకటేశువొద్ద సిగ్గుపడి వున్నదాన చేవదేర నిప్పుడేమి సింగారించేరే
యీవల నాతడు గూడె యీసొమ్ము లిన్నియును వేవే లాతడిచ్చినవె వేగిర పడకురే

No comments:

Post a Comment