శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 7, 2010

ఘనమనోరాజ్యసంగతి

ఘనమనోరాజ్యసంగతి చెలగినగాని జనులకెప్పుడు నాత్మ సౌఖ్యంబు లేదు

ప్రతిలేని ధైర్యంబు పదిలపరచినగాని మతిలొనిపగవారిమద మణపరాదు
మితిలేనినిశాంతమను మేటికైదువగాని కృతకంబువిషయముల గేలుపెరుగరాదు

సొరిది నిర్మొహమనుజోడు దొడిగినగాని వెరపుడిగి మమతచే వెళ్ళబడరాదు
యిరవై నవిజ్ఞానపింట నుండినగాని అరసి జగమెల్ల తానై యేలరాదు

యిన్నియును దిరువేంకటేశు డిచ్చినగాని తన్నుదానెరిగి యాతని గొలువరాదు
కన్నులను వెలి లోను గలయజూచినగాని సన్నంబు ఘనమనెడిజాడ గనరాదు

No comments:

Post a Comment