ఘను డీతడొకడు గలుగగగదా వేదములు జననములు గులము లాచారములు గలిగె
కలుషభంజను డితడు గలుగగగదా జగతి గలిగె నిందరిజన్మగతులనెలవు
మలసి యితడొకడు వొడమగగదా యిందరికి నిలువ నీడలు గలిగె నిధినిధానములై
కమలాక్షు డితడు గలుగగగదా దేవతలు గుమిగూడి రిందరును గండిగడచి
ప్రమదమున నితడూ నిలుపగగదా సస్యములు అమర ఫలియించె లోకానందమగుచు
గరిమె వేంకటవిభుడొకడు గలుగగగదా ధరయు నభమును రసాతలము గలిగె
పరమాత్ముడితడు లోపల గలుగగగదా అరిది చవులును హితవు లన్నియును గలిగె
No comments:
Post a Comment