శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 7, 2010

ఘనుడాతడే

ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు

యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి
యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు

పురుషోత్తముడని పొగడి రెవ్వరిని కరి నెవ్వడు గాచె
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె అరుదుగ మేమిక నతనికె శరణు

శ్రీసతి యెవ్వని జేరి వురమునను భాసిల్లె నెవ్వడు పరమంబై
దాసుల కొరకై తగు శ్రీవేంకట మాస చూపి నితడతనికె శరణు

No comments:

Post a Comment