శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎన్ని మహిమల

ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు కనుల పండువులెల్ల గదిసినట్లుండె

పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి ఏలీల నుండె నని యెంచి చూచితే
పాల జలధిలోన పవళింపగా మేన మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె

తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి ఎట్టుండెనని మది నెంచి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె

అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను నిలువెల్ల సిరులై నిండినట్లుండె

No comments:

Post a Comment