శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎన్నిచేత

ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని భావాలు

యేమి లీలలు నటియించే వేమయ్య దేవుడా భూమిలో జీవులనెల్ల బుట్టింపుచు
ప్రేమతో మాటలాడే పిన్నవాడవూ గావు నీ మహిమ లిన్నియూ నీకె తెలుసు

యెంతని వదరుకొనే విందిరా నాథుడా అంతరంగముల నుండె అందరిలోన
వింతలు లేవు నీకు వెఱ్ఱివాడవు గావు యింతేసి విచారాలు యివి నీకె తెలుసు

చెలగి వరాలిచ్చేవు శ్రీ వేంకట నాథుడా తలకక నిన్ను గొల్చే దాసులకు
అలరి నీవైతేను అశక్తుడవు గావు నెలవైన నీ సుద్దులు నీకె తెలుసు

No comments:

Post a Comment