ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా
ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా
ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా
తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
వరుస నేనుగుమీదివాని సున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా
No comments:
Post a Comment