శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎన్నిలేవు నాకిటువంటివి

ఎన్నిలేవు నాకిటువంటివి కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి

అరయ నేజేసినయపరాధములు చూచి కరుణించి వొకడైన గాచునా
కరచరణాదులు కలిగించిననిన్ను బరికించి నీసేవాపరుడ గాలేనైతి

ఏతరినై నే నెరిగి సేసినయట్టి పాతక మొకడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నోవొసగిన చేతనమున నిన్ను జెలగి చేరనైతి

శ్రీవేంకటేశ నే జెసినయితరుల సేవ కొకడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి

No comments:

Post a Comment