శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తీపనుచు చేదు

తీపనుచు చేదు తెగదని వెనక బడరాని ఆపదలచేత బొరలాడేము గాన

అప్పుదీరినదాకా నలవోకకైనవా రెప్పుడును దనవార లేలౌదురు
అప్పటప్పటికి బ్రియ మనుభవింపుచు మమత చెప్పినటువలె దాము సేయవలెగాక

పొందైన వారమని పొద్దు వోకకు దిరుగు యిందరును దమవార లేలౌదురు
కందువగు తమకార్యగతులు దీరినదాక సందడింపుచు బ్రియము జరపవలెగాక

తెగనికర్మము దమ్ము దిప్పుకొని తిరిగాడ అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి
తగువేంకటేశ్వరుని దలచియిన్నిటా దాము విగతభయులయి భ్రాంతి విడువవలె గాక

No comments:

Post a Comment