ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా
ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన చలన విధినిపుణ నిశ్చల నారసింహా
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ కారణ ప్రకట వేంకట నారసింహా
No comments:
Post a Comment