శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

బండి విరిచి

బండి విరిచి పిన పాపలతోనాడి దుండగీడు వచ్చె దోబూచి

పెరుగు వెన్నలు ప్రియమున వే మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున తన విధము దాచుకొని దొరదొంగ వచ్చె దోబూచి

పడుచు గుబ్బెత పరపుపై పోక ముడి కొంగు నిద్ర ముంపునను
పడియుత వద్ద పవళించినట్టి తొడుకుదొంగ వచ్చె దోబూచి

గొల్ల పల్లెలొఇల్లిల్లు చొచ్చి కొల్లలాడిన కొడెకాదు
యెల్లయిన వేంకటేశుడు ఇదె తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

No comments:

Post a Comment