శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

బడలెను పానుపు

బడలెను పానుపు పరచరే అడుగరే యిదియేమని చెలులు

చెలప చెమటలు మై జిప్పిలీని అలసి వచ్చినాడు నేడదే విభుడు
చలువగా గప్రము పై చల్లగదరే వెలయ సురటిగొని విసరరే

పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని పనిసేసి వచ్చినా డప్పటి విభుడు
తనివార చల్లనిగంధము మెత్తరే నినుపుగ పన్నీరు నించరే

దాగక దప్పి మోవులు దడిపీని కాగి వచ్చినాడు శ్రీవేంకటవిభుడు
పాగి వాసించినబాగాలియ్యరే చేగదేర నన్నునేలె సేవలెల్లా జేయరే

No comments:

Post a Comment