బడి బడి తిరిగాడీ బాలకృష్ణుడు ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు
చొక్కుచు సోలుచువచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుడు
ఇక్కువకూ చేయిచాచి ఏడనైన తొంగిచూచి ఎక్కుడు గామిడికద ఈ బాలకృష్ణుడు
చన్నులంటి సారె సారె చవిగా ముద్దులువెట్టి పన్నీకదే మోహమెల్ల బాలకృష్ణుడు
సన్నలనే మొక్కు మొక్కి సమ్మతిపై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు
నిండుకాగిట నించి నేరుపులు పచరించీ పండు మాటలాడీకదే బాలకృష్ణుడు
అండనే శ్రీవేంకటాద్రి న్యాయమెరిగి తాకూడే ఎండనీడ కన్నులతో బాలకృష్ణుడు
No comments:
Post a Comment