శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

బయలు పందిలి

బయలు పందిలి వెట్టి పరగ జిత్తము గలిగె దయమాలి తిరుగ నాత్మ డొక్కడు గలిగె

కనుచూపు వలన నుడుగని కోరికలు గలిగె తనుకాంక్ష వలన బరితాపంబు గలిగె
అనుభవమువలన మోహాంధకారము గలిగె తనివిదీరమి వలన తలపోత గలిగె

అడియాసవలన పాయనిచలంబును గలిగె కడుమమత వలన చీకటి దవ్వ గలిగె
కడలేని తమకమున గాతాళమును గలిగె నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె

తరితీపువలన చిత్తభ్రాంతి తగ గలిగె విరహంబువలన పురవేదనలు గలిగె
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము పరిపూర్ణమైన యాపద నీద గలిగె

No comments:

Post a Comment