బలుపుడు హరి జేపట్టితిని తలచినదెల్లా దక్కెను నాకు
దురిత ధ్వంసుడు దుఃఖవిదారుడు అరిభయంకరు డచ్యుతుడు
సిరివరు డితనిని జేకొని కొలిచిన పరమసుఖమెపో భయ మెక్కడిది
దానవాంతకుడు దైవశిఖామణి మానరక్షకుడు మాధవుడు
నానాముఖముల నాపాల గలడు యేనెపముల నా కెదురే లేడు
అనయము నిర్మలు డఖిలానందుడు ఘను డీశ్రీవేంకటవిభుడు
కనుకొని మము నిటు గాచుక తిరిగీ యెనయగ నేలికె యితడేమాకు
No comments:
Post a Comment