బలువగు దనరూపము చూపెన్ కలదింతయు దనఘన తెరిగించెన్
పాండవ రక్షణపరుడై నరునకు నండనే తెలిపె మహామహిమ
దండి విడిచి తనదయతో నర్జును డుండగ మగటిమి నొడబడ బలికె
మగుడగ కులధర్మములు బుణ్యములు తెగి పార్థున కుపదేశించెన్
నగుచు నతనితో నానాగతులను నిగమమునియమమునిజ మెరిగించెన్
వెరవుమిగుల నావిజయునిమనుమని పరీక్షిత్తు దగ బ్రదికించెన్
తిరువేంకటగిరిదేవుడు దానై గరిమల భారతకథ గలిగించెన్
No comments:
Post a Comment