బలువగుకర్మము లివివో జీవులప్రారబ్ధంబులు సంచితంబులును
బలిసి తీరవివి పెరుగనేకాని బ్రహ్మలబహు కల్పంబులదాక
పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవులప్రారబ్ధములై
యేయెడజూచిన నెదిటికొలుచులై యిచ్చట నిటు భుజియించగను
కాయపుబెడతటిగండడు విధి దనుగడదేర్చిన తనకడకర్మములు
పోయి సంచితంబుల గలసిన నవి పొదలుచు గొండలపొడవై పెరుగు
పొదలి సంచితంబులు వడిబెరుగును పొలియును జీవునిపుణ్యము జాలక
యెదిగినపుణ్యం బిగురును కాగినయినుముమీది జలమువలెను
పదిలములై కడుబాపకర్మములే బరువై పరగగ బ్రాణికి నెన్నడు
తుదయు మెదలు నెందును లేక వడి దొలగక భవములతొడవై తిరుగు
తలుపులో నవయదలచినజంతువు కలుషహరుడు వేంకటగిరిపతి దను
దలచుభాగ్యమాత్మకు నొసగిన జిత్తము పరిపక్వంబై యెపుడు
జలజోదరుదలచగ బ్రారబ్ధంబులు సంచితంబులు బొలిసి పుణ్యులై
చెలువగునిత్యానందపదంబున జెలగి సుఖించగ జేరుదు రపుడు బలు
No comments:
Post a Comment