వందేహం జగద్వల్లభం దుర్లభం మందర ధరం గురుం మాధవం భూధవం
నరహరిం మురహరం నారాయణం పరం హరిం అచ్యుతం ఘనవిహంగ వాహనం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం కరుణాభరణం కలయామి శరణం
నంద నిజనందనం నందక గదాధరం ఇందిరానాథ మరవిందనాభం
ఇందురవి లోచనం హితదాసపదం ముకుందం యదుకులం గోపగోవిందం
రామానామం యజ్ఞరక్షణం లక్షణం వామనం కామితం వాసుదేవం
శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం శ్యామలం కోమలం శాంతమూర్తిం
No comments:
Post a Comment