శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 24, 2010

వందే వాసుదేవం

వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం

ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ చందనాంకిత లసత్చారు దేహం
మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభం

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేషపన్నగరాజ శాయినం ఘననివాసం

కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరు వేంకటాచలాధీశం భజే


Download

No comments:

Post a Comment