వననిధి గురిసినవాన లివి మతి పనిలేని పనులభారములు
అడవులవెన్నెల లారిడిబదుకులు తడతాకులపరితాపములు
వొడలొసగినహరి నొల్లక యితరుల బడిబడి దిరిగిన బంధములు
కొండలనునుపులు కొనకొనమమతులు అండలకేగిన నదవదలు
పండినపంటలు పరమాత్ము విడిచి బండయితిరిగిన బడలికలు
బచ్చనరూపులు పచ్చలకొలపులు నిచ్చలనిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణుని గొలువక చచ్చియు జావని జన్మములు
No comments:
Post a Comment