వద్దే గొల్లెత వదలకువే నీ ముద్దుమాటలకు మొక్కేమయ్యా
యేలే యేలే యేలే గొల్లెత నాలాగెరగవా నన్నునే చేవు
చాలుజాలు నికజాలు నీరచనలు పోలవు బొంకులు పోవయ్యా
కానీ కానీ కానిలే గొల్లెత పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారు జెనుకుచు మాతోనిటు సొలయక తొలవయ్యా
రావా రావా రావా గొల్లెత శ్రీ వేంకటగిరి చెలువుడను
నీవె నీవె నను నించితి కౌగిట కైవశమైతిని గదవయ్యా
No comments:
Post a Comment