శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరిపూర్ణగరుడాద్రిపంచాననం

పరిపూర్ణగరుడాద్రిపంచాననం పరమం సేవే పంచాననం

కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం పారీణచక్రధర పంచాననం
వీరపంచాననం విజయపంచాననం భారభూభారహరపంచాననం

దివిజపంచాననం తీవ్రనఖకాననం భవనాశినీతీరపంచాననం
కువలయాకాశసంఘోషపంచాననం పవిశబ్దదంతరవపంచాననం

శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం పావనం పంచముఖపంచాననం
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం భావితం శ్రీయుక్తపంచాననం

No comments:

Post a Comment