శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరమాత్ముని

పరమాత్ముని నోరబాడుచును యిరు దరులు గూడగదోసి దంచీ మాయ

కొలదిబ్రహ్మాండపుకుందెనలోన కులికి జీవులనుకొలుచు నించి
కలికిదుర్మోహపురోకలి వేసి తలచి తనవులను దంచీ మాయ

తొంగలిరెప్పలు రాత్రిబగలును సంగడికనుగవ సరిదిప్పుచు
చెంగలించి వెస జేతులు విసరుచు దంగుడుబియ్యముగా దంచీ మాయ

అనయము దిరువేంకటాధీశ్వరుని పనుపడి తనలో బాడుచును
వొనరి విన్నాణిజీవులనియెడిబియ్యము తనర నాతనికియ్య దంచీ మాయ

No comments:

Post a Comment