పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారించ తగునీకు అమ్మ
కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ
కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి నేమపు వితరణము నీకే తగునమ్మ
పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు పాలపండే శ్రీవేంకటపతి దేవివి
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా పాల గలిగితివి సంబంధము మేలమ్మ
No comments:
Post a Comment