శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరమాత్మ

పరమాత్మ నిన్నుగొల్చి బ్రతికేము విరసపు జాలివెత బడనోపము

మగడు విడిచినా మామ విడువని యట్లు నిది నా మనసు రోసినా లోకులు మానరు
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగమోటాలను నేను మోసపోవ నోపను

పొసగ దేవుడిచ్చినా పూజారి వరమీడు విసిగినే విడిచినా విడువరు వీరేలోకులు
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడలనే నోపను

నుడుగుట దప్పినా నోము ఫల మిచ్చినట్లు కడగి వేడుకొన్నాగానిమ్మనరు లోకులు
తడవేరు తగిలేరు తామె శ్రీ వేంకటేశ బుడి బుడి సంగతాలయబొరల నే నోపను

No comments:

Post a Comment