శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరమపాతకుడ

పరమపాతకుడ భవబంధుడ శ్రీహరి నిను దలచ నే నరుహుడనా

అపవిత్రుడ నే నమంగళుడ గడు నపగతపుణ్యుడ నలసుడను
కపటకలుష పరికరహృదయుడ నే నపవర్గమునకు నరుహుడనా

అతిదుష్టుడ నే నధికదూషితుడ హతవివేకమతి నదయుడను
పతిలేనిరమాపతి మిము దలచలే నతులగతికి నే నరుహుడనా

అనుపమ విషయ పరాధీనుడ నే ననంత మోహభయాతురుడ
వినుతింపగ దిరువేంకటేశ ఘనులనఘులుగాక నే నరుహుడనా

No comments:

Post a Comment