శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరమజ్ఞానులకు

పరమజ్ఞానులకు ప్రపన్నులకు మరుగురుని మీద మనసుండవలదా

ఆకలి గొన్నవానికి అన్నముపై నున్నట్లు యేకత నుండవలదా యీశ్వరునిపైని
కాకల విటుల చూపు కాంతలపై నున్నట్లు తేకువ నుండవలదా దేవుని మీద

పసిబిడ్డలకు నాస పాల చంటిపై నున్నట్లు కొసరి భక్తి వలదా గోవిందు పైని
వెస తెరువరి తమి విడి తలపై నున్నట్లు వసియించ వలదా శ్రీ వల్లభు మీదటను

నెప్పున ధనవంతుడు నిధి గాచి యుండునట్లు తప్పక శ్రీ వేంకటేశు తగుల వద్దా
అప్పనమైన భ్రమ ఆలజలాల కున్నట్లు ఇప్పుడే వుండ వలదా ఈతని మీదను


Download

No comments:

Post a Comment