శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, July 13, 2010

పరమ యోగీశ్వరుల

పరమ యోగీశ్వరుల పద్ధతియిది ధరణిలో వివేకులు దలపోసుకొనుట

మొదలనాత్మ ఙ్ణానము దెలిసి పిమ్మట హృదయములోని హరినెరుగుట
వుదుటైన యింద్రియాల నొడిసి వంచుకొనుట గుదిగొన్న తనలో కోరికలుడుగుట

తన పుణ్యఫలములు దైవముకొసగుట పనివడి యతనిపై భక్తి చేసుట
తనివితో నిరంతర ధ్యాన యోగపరుడౌట మనసుతో ప్రకృతి సంబంధము మరచుట

నడమ నడమ విఙ్ణానపు కథలు వినుట చిడిముడినాచార్య సేవసేయుట
యెడయక శ్రీ వేంకటేశుపై భారమువేసి కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట

No comments:

Post a Comment