శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, July 12, 2010

పరమ పురుషుడు

పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దులాడీనిదివో

వేదపురాణాలలో విహరించేదేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము
శ్రీదేవి పాలిటి చెలగే నిధానము సేదదీరి యశోదకు శిశువాయ నిదివో

మొక్కేటి నారదాదుల ముందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మకొడుకుగా గన్న పరమము అక్కరతో వెన్నముచ్చై ఆటలాడీ నిదివో

దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్కరూపైన భావతత్వము
శ్రీ వేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో

No comments:

Post a Comment