శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 25, 2010

వట్టియాసలకు

వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ

చాలనమ్మి యీసంసారమునకు సోలిసోలి తిరిగేవు బాలయవ్వన ప్రౌఢలభ్రమ బడి లోలుడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీదెరుగక తిరిగేవు మాలెమీద పరువెందాకా నీమచ్చిక విడువగలేవు

మానితముగ దురన్నపానముల మత్తుడవై వుండేవు నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియగలేవు

పామరివై దుర్వ్యాపారమునకు పలుమారును బొయ్యేవు వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమతో హరిదాసులపై సంప్రీతి నిలుపగాలేవు తామసమతివయి వేంకటనాథునితత్త్వ మెరుగగాలేవు

No comments:

Post a Comment