శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

పంటల భాగ్యులు

పంటల భాగ్యులు వీరా బహువ్యవసాయులు అంటిముట్టి యిట్ల గాపాడుదురు ఘ్హనులు

పొత్తుల పాపమనేటి పోడు నఇకివేసి చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచి వానపదనున విత్తుదురు హరిభక్తి వివేకులు

కామక్రోధాదులనే కలుపు దువ్వివేసి వేమురు వైరాగ్యమనే వెలుగు వెట్టి
దోమటి నాచార విధుల యెరువులువేసి వోముచున్నారు జ్గ్యానపు బైరుద్యోగజనులు

యెందు చూచిన శ్రీవేంకటేశుడున్నాడనియెడి అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులు దాము గొంది నిముడుకొందురు గురుక్రుప జనులు

No comments:

Post a Comment