శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

పండియు బండదు

పండియు బండదు చిత్తము పరిభవ మెడయదు కాంక్షల యెండలచే కాగితి మిక నేలాగోకాని

పదిగోట్ల జన్మంబుల బాయనికర్మపుబాట్లు వదలక వొకనిమిషములో వడి దీరుచు నితడు
చెదరని నిజదాసులకును శ్రీహరి మాకిపుడంతక హృదయము నిలువదు చంచల మేలాగోకాని

కూపపుబహునరకంబుల కోట్లసంఖ్యల బొరలేటి పాపము లొకనుమిషములో బాపగగల డితడు
కాపాడగ దలచిన యీకమలాపతి నేమీతని యేపున గని మనలేమిక నేలాగోకాని

జడిగొని యెన్నడు బాయని సంసారపు బంధంబుల విడుమని వొకనిమిషములో విడిపించును యితడు
కడుగొలిచినవారికి వేంకటపతి నేమీతని నెడయక కొలువగలేమిక నేలాగోకాని

No comments:

Post a Comment