శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

పటుశిష్టప్రతిపాలకుడ

పటుశిష్టప్రతిపాలకుడ వనగ ఘటన నఖిలమును గాతువుగా

తుత్తుమురుగ దైత్యుల దనుజుల నని మొత్తిమోది చలమున జెలగి
జొత్తుపాపలుగ సొరిది విరోధుల నెత్తురు వడుతువు నీవేకా

తళతళమెరుచు సుదర్శనాయుధం బలరుచు నొకచే నమరగను
బలుదైత్యులదొబ్బలు బేగులు నని నిలువున జెండుదు నీవేకా

దిట్టవు సూత్రవతీపతి వసురల జట్టలు చీరగ జతురుడవు
రట్టడి వేంకటరమణుని వాకిట పట్టపుసేనాపతివటకా

No comments:

Post a Comment