శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

పట్టము గట్టితివింక

పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా

అలమేలు మంగకు సింహాసనము నీవురము కలిత హారములే సింగారపు దండలు
తొలుత నీహస్తములే తోరణ గంభములు చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా

పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు మెరుగు గౌస్తుభమణి మించుటద్దము
గరిమ నీసొబగులు కప్పములు గానికలు సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా

సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు వింత రతి భోగములు వినోదాలు
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా

No comments:

Post a Comment