పట్టరో వీదుల బరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసీ వీడే
వేవేలు నేరాలు వెదకేటిదేవుడు ఆవుల గాచీ నలవాడే
పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు సోవల యశోదసుతుడట వీడే
ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు కినిసి వెన్న దొంగిలె వీడే
మునులచిత్తములమూలపుదేవుడు యెనసీ గొల్లెతలయింటింట వీడే
నుడిగి నారదుడు నుతించుదేవుడు బడిరోలగట్టువడె వీడే
వుడివోనివరము లొసగెడుదేవుడు కడగిన శ్రీ వేంకటగిరి వీడే
No comments:
Post a Comment