పట్టవసముగాని బాలుడా పెను బట్టపుబలువుడ బాలుడా
ఇరుగడ బ్రహ్మయు నీశ్వరుడును నిన్ను సరుస నుతింప జఠరమున
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన పరమమూర్తివా బాలుడా
తల్లియు దండ్రియు దనియనిముదమున వెల్లిగ లోలో వెరవగను
కల్లనిదురలో గనుమూసుక రే పల్లెలో బెరిగిన బాలుడా
యేదెస జూచిన నిందరిభయముల సేదలు దేరగ జెలగుచును
వేదపల్లవపు వేంకటగిరిపై పాదము మోపిన బాలుడా
No comments:
Post a Comment