పట్టిన వారల భాగ్యమిదే గుట్టు తెలిసితే గురుతులివే
కామ ధేనువును కల్పవృక్షమును దామోదర నీ దర్శనం
భూమీశత్వము భువనేశత్వము సామజ వరద నీ శరణ్యము
పరుస వేదియును పరమైశ్వర్యము హరి నిను గొలిచే అనుభవము
నిరత భోగములు నిధి నిధానములు గరిమ మెరయు మీ కైంకర్యములు
నిండు భొగములు నిత్య శోభనము కొండలయ్య నీ గుణ కధలు
అండనె శ్రీ వేంకటాధిప సర్వము మెండు కొన్నదిదె మీ కరుణ
No comments:
Post a Comment